News October 18, 2025

బీబీనగర్‌లో గంజాయి ముఠా అరెస్టు

image

బీబీనగర్ పోలీసులు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. మండలంలోని కొండమడుగు మెట్టు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆటోను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ గుట్టు రట్టైంది. పట్టుబడినవారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించి, రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 19, 2025

విశాఖలో ‘పెట్టుబడుల’ పాలిటిక్స్..!

image

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం తదితర పెట్టుబడులను కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో YCPనేతలు అదే స్థాయిలో ప్రశ్నలు సంధిస్తున్నారు. డేటా సెంటర్ల‌తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? వాటికి అవసరమయ్యే నీరు ఎంత? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్ ఏర్పాటు వ్యతిరేక నిరసనలకు YCPసంఘీభావం ప్రకటించింది. మరి ప్రజల మనసులో ఎవరి మాట నిలుస్తుందో చూడాలి.

News October 19, 2025

హార్బర్ సముద్ర బీచ్‌లో పటిష్ఠ బందోబస్తు: ఎస్ఐ

image

నిజాంపట్నం హార్బర్ సముద్ర తీరంలో యాత్రికుల భద్రత కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ కందుల తిరుపతిరావు తెలిపారు. శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా బీచ్ పరిసరాలను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు బీచ్‌లో నిరంతర నిఘా ఉంటుందన్నారు. బీచ్‌లో మద్యం తాగడం, నిషేధిత ప్రాంతాల్లో తిరగడం పూర్తిగా నిషేధమన్నారు. నింబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 19, 2025

Dhanteras: 50 వేల కార్లు డెలివరీ చేస్తున్న మారుతి సుజుకీ!

image

ధన్‌తేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో 50 వేల కార్లను డెలివరీ చేస్తున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. శనివారం 41 వేల కార్లను కస్టమర్లకు అందజేశామని చెప్పింది. ఆదివారం మరో 10 వేలు డెలివరీ చేస్తామని, తద్వారా 51 వేల కార్ల రికార్డును అందుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ SEO పార్థో బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఏడాది ధన్‌తేరాస్ శనివారం మధ్యాహ్నం 12.18కి ప్రారంభమై, ఇవాళ మధ్యాహ్నం 1.51గం. దాకా కొనసాగనుంది.