News October 18, 2025
HYD: లక్షకు పైగా మొబైల్స్ రికవరీ: సీఐడీ

తెలంగాణ సైబర్ క్రైమ్, సీఐడీ మరో రికార్డ్ సృష్టించింది. దొంగిలించబడిన, పోయిన మొబైల్స్ రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,00,020 మొబైల్స్ రికవరీ చేసి జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేసింది. దేశంలోని పైలట్ ప్రాజెక్టుల కంటే ఆలస్యంగా ప్రారంభమైనా, తెలంగాణ సీఈఐఆర్ సిస్టమ్ అద్భుత ఫలితాలు సాధించింది.
Similar News
News October 19, 2025
రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
News October 19, 2025
కరీంనగర్: 72 గంటల్లోపే నగదు, బోనస్

ధాన్యం విక్రయించిన 72 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం ఖరీదుతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వ్యవసాయ శాఖ అధికారులను సమాయత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే క్వాంటిటీ, గ్రేడ్, అకౌంట్ నంబర్లను వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది.ఉమ్మడి జిల్లాలో 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారుల అంచనా.
News October 19, 2025
కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.