News October 18, 2025
PDPL: నేటితో ముగియనున్న గడువు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం జోన్‌లలో 74 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటివరకు 566 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. నిన్న ఒక్కరోజులోనే 348 వచ్చాయన్నారు. నేటితో దరఖాస్తుల గడవు ముగియనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 19, 2025
అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం
News October 19, 2025
ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?
News October 19, 2025
బెల్లంపల్లి: ఈనెల 26న మెగా జాబ్ మేళా

బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ క్రీడా మైదానంలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కోసం మైదానాన్ని మందమర్రి జీఎం రాధాకృష్ణ పరిశీలించారు. జాబ్ మేళాకు మందమర్రి, బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలోని సుమారు 7,000 మంది నిరుద్యోగ యువత రానున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పాలు సలహాలు, సూచనలు చేశారు.