News October 18, 2025

HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

image

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News October 18, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: స్టార్ క్యాంపెయినర్లుగా మీనాక్షి, రేవంత్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజ్‌, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. ఇక ఈ మూడు వారాలు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలతో సందడిగా మారనుంది.

News October 18, 2025

రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియం దున్నరాజుల ప్రదర్శనకు వేదికైంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి తరలిరానున్నారు. సదర్‌ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో పండుగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారీ ఆకారంలో ఉన్న దున్నపోతులు రేపు విన్యాసాలు చేయనున్నాయి. కాగా, ఈ నెల 22న నారాయణగూడలో పెద్ద సదర్ జరగనుంది.

News October 18, 2025

HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

image

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.