News October 18, 2025
సింహాచలం ఆలయ పైకప్పుకు కొత్త అందం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఇప్పుడు కొత్త రూపంలో మెరిసిపోతోంది. ఆలయ ప్రధాన గర్భగృహం, కళ్యాణ మండపం, వ్రత మండపం, వంటశాలకు టెర్రాకోట పెంకులతో కొత్త పైకప్పు ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రీలిజియస్ ట్రస్ట్ సుమారు రూ.5 కోట్లతో ఈ మరమ్మతులు చేపట్టింది. పాత పద్ధతిలోనే పైకప్పును పునరుద్ధరించి, శిల్పకళా అందాన్ని కాపాడుతూ ఆలయానికి నూతన శోభను చేకూర్చింది.
Similar News
News October 18, 2025
కురుపాం: అందుబాటులో లేని 108.. వ్యక్తి మృతి

కురుపాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18044722>>గాయపడ్డ<<>> గొట్టాపు గౌరినాయుడు మృతి చెందాడు. పూతికవలసకు చెందిన మృతుడు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో 30 నిమిషాల వరకు వాహనం రాలేదు. దీంతో ఆటోలో కురుపాం సీహెచ్సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News October 18, 2025
బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
News October 18, 2025
రేపు రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్: కలెక్టర్

వాణిజ్య, వ్యాపార రంగాలకు నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ‘ది గ్రేట్ రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలో తెలిపారు. ఈ నెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆనంద్ రీజెన్సీ సమీపంలోని పందిరి ఫంక్షన్ హాల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన పెంచడం, వ్యాపారంలో ఉత్సాహం నింపడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.