News October 18, 2025
నిర్మల్: పీటీఎం మీటింగ్ వాయిదా

బీసీ బంద్ నేపథ్యంలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే పీటీఎం (పేరెంట్ టీచర్స్ మీటింగ్) రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు విషయాన్ని ఆయా ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు కోరారు.
Similar News
News October 18, 2025
టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్?.. చర్చలు జరుగుతున్నాయన్న గోయల్

భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూఎస్ టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్ వస్తుందా అని మీడియా ప్రశ్నించగా ‘ట్రేడ్ చర్చలు, ఒప్పందాలు డెడ్‌లైన్స్ ఆధారంగా జరగవు. రైతులు, జాలర్లు, MSME రంగ ప్రయోజనాలు కాపాడేవరకు ఎలాంటి అగ్రిమెంట్ పూర్తికాదు. చర్చలు బాగా సాగుతున్నాయి. మేము ఓ నిర్ణయానికి వచ్చాక తెలియజేస్తాం’ అని తెలిపారు.
News October 18, 2025
కురుపాం: అందుబాటులో లేని 108.. వ్యక్తి మృతి

కురుపాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18044722>>గాయపడ్డ<<>> గొట్టాపు గౌరినాయుడు మృతి చెందాడు. పూతికవలసకు చెందిన మృతుడు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో 30 నిమిషాల వరకు వాహనం రాలేదు. దీంతో ఆటోలో కురుపాం సీహెచ్సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News October 18, 2025
బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.