News October 18, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు సాధించిన వారు NOV 3వరకు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.1.60లక్షల వరకు జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

Similar News

News October 18, 2025

టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్?.. చర్చలు జరుగుతున్నాయన్న గోయల్

image

భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూఎస్ టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్ వస్తుందా అని మీడియా ప్రశ్నించగా ‘ట్రేడ్ చర్చలు, ఒప్పందాలు డెడ్‌లైన్స్ ఆధారంగా జరగవు. రైతులు, జాలర్లు, MSME రంగ ప్రయోజనాలు కాపాడేవరకు ఎలాంటి అగ్రిమెంట్ పూర్తికాదు. చర్చలు బాగా సాగుతున్నాయి. మేము ఓ నిర్ణయానికి వచ్చాక తెలియజేస్తాం’ అని తెలిపారు.

News October 18, 2025

బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

image

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

News October 18, 2025

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధానా!

image

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.