News October 18, 2025
గొల్లపూడి ఘాట్ వద్ద విపత్తులపై మాక్ డ్రిల్

విపత్తుల సమయంలో ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించినట్లు విజయవాడ ఆర్డీఓ చైతన్య తెలిపారు. గొల్లపూడి ఘాట్ వద్ద రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) నేతృత్వంలో ఈ మాక్ ఎక్సర్‌సైజ్ జరిగింది. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, వైద్య, పశుసంవర్ధక, మహిళా శిశు సంక్షేమ శాఖల సిబ్బంది ఇందులో పాల్గొని, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు.
Similar News
News October 19, 2025
TODAY HEADLINES

☛ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు DA ప్రకటన
☛ జగన్ విషప్రచారాన్ని మంత్రులు అడ్డుకోవాలి: సీఎం CBN
☛ TGలో బీసీ సంఘాల ‘రాష్ట్ర బంద్’
☛ గ్రూప్-2 నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్.. పేరెంట్స్‌ను జాగ్రత్తగా చూసుకోకపోతే జీతం కట్ చేస్తామని కామెంట్
☛ పాక్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే.. రాజ్‌నాథ్ వార్నింగ్
☛ పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు AFG డొమెస్టిక్ క్రికెటర్లు మృతి
News October 19, 2025
జనగణన-2027 కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 మధ్య 2 ఫేజుల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ షెడ్యూల్, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. తొలుత ప్రీటెస్టు సేకరణ చేపడతారు. ఫస్ట్ టైమ్ జనాభా లెక్కల్లో కులాల సమాచారాన్ని సేకరించనున్నారు. వ్యక్తిగత వివరాల్ని డిజిటల్‌గా అందించేందుకూ అవకాశం ఇస్తారు.
News October 19, 2025
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

నల్లమాడలోని KGBV పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. తరగతి, వంట గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ పాఠాలను బోధించారు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని కలెక్టర్ సూచించారు.