News October 18, 2025
HYD: జిమ్‌లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

సికింద్రాబాద్‌లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్‌కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.
Similar News
News October 18, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: స్టార్ క్యాంపెయినర్లుగా మీనాక్షి, రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. ఇక ఈ మూడు వారాలు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలతో సందడిగా మారనుంది.
News October 18, 2025
రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియం దున్నరాజుల ప్రదర్శనకు వేదికైంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి తరలిరానున్నారు. సదర్‌ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో పండుగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారీ ఆకారంలో ఉన్న దున్నపోతులు రేపు విన్యాసాలు చేయనున్నాయి. కాగా, ఈ నెల 22న నారాయణగూడలో పెద్ద సదర్ జరగనుంది.
News October 18, 2025
HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.