News October 18, 2025

జనగామ: ధాన్యం గ్రేడింగ్‌లో సందేహాలా?

image

ధాన్యం కొనుగోలు సమయంలో గ్రేడింగ్ నిర్ధారణలో సందేహాలుంటే సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. నిర్ధారించుకునేందుకు డీఏవో కార్యాలయం(8977745482), పౌర సరఫరాల శాఖ(9966361171), టెక్నికల్ అసిస్టెంట్ (9666222500) నంబర్లలో సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 18, 2025

వరంగల్: తగ్గేదేలే.. మద్యం టెండర్ల జోరు..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తగ్గేదేలే అంటున్నారు. చివరి రోజు సాయంత్రం తర్వాత భారీగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. సాయంత్రం 5 వరకు సగానికి పైగా షాపుల్లో సింగిల్ డిజిట్ దాటలేదు. కానీ, 9 గంటల వరకు వరంగల్ అర్బన్‌లో 2945, వరంగల్ రూరల్ 1767, భూపాలపల్లిలో 1055, మహబూబాబాద్‌లో 1000కి పైగా వచ్చాయి. రాత్రి వేళలో సైతం బారులు తీరారు.

News October 18, 2025

ప్రశాంతమైన నిద్ర కోసం టిప్స్

image

*రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందనేది అపోహే. మొదట్లో మత్తుగా ఉన్నా, ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది.
*రాత్రి పడుకోవడానికి గంట ముందు పాలు తాగాలి. అవకాడో, అరటి తినాలి.
*వెలుతురు లేని గదిలో పడుకోవాలి. బెడ్ లైట్ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
>నిద్ర సరిగా లేకుంటే దీర్ఘకాలంలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News October 18, 2025

5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

image

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.