News October 18, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఈ నెల 19-24 వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన.. వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
* తిరుమలలో TG భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.4లక్షలు కాజేసి పరారీ
* పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు(D)కు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై TDP అధిష్ఠానం సీరియస్.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుపు
Similar News
News October 18, 2025
జమ్మూకశ్మీర్‌పై సరైన సమయంలో నిర్ణయం: అమిత్ షా

జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లద్దాక్ విషయంలో లేవనెత్తిన డిమాండ్లకు సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అయితే వారు ఓపికగా ఉండాలని కోరారు. బిహార్‌లోని పట్నాలో ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో సమూల మార్పులు జరిగాయని, గత 9 నెలల్లో స్థానికంగా ఒక్క టెర్రరిస్టు రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని చెప్పారు.
News October 18, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⤇ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులందరిదీ ఒకటే జెండా, అజెండా.. అధికారం లేదన్న అసహనంతోనే క్యాబినెట్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు: మంత్రి శ్రీధర్ బాబు
⤇ కరీంనగర్(D) గంగాధర, జగిత్యాల(D) ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
⤇ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGPICS)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
News October 18, 2025
ఊరిస్తున్న రికార్డులు.. కోహ్లీ అందుకుంటాడా?

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత AUS సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
*మరో 54 runs: ODIల్లో అత్యధిక రన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్.
*68 runs: లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ల (ODI, T20)లో ఫస్ట్ ప్లేస్‌కు. సచిన్ (18,436) తొలి స్థానంలో ఉన్నారు.
*సెంచరీ: ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(సచిన్-51), ఆసియా వెలుపల ఎక్కువ సెంచరీలు చేసిన Asian బ్యాటర్‌గా (సచిన్-29) రికార్డు