News October 18, 2025

కృష్ణా: నేడే ఫైనల్.. పదవి ఎవరికి దక్కేనో..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుల ఎంపిక నేడు ఖరారు కానుంది. మధ్యాహ్నం CM ఈ నియామకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. NTR నుంచి బుద్ధా వెంకన్న (BC), గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (OC), కృష్ణా నుంచి కోనేరు నాని (OC), గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLAల మద్దతు కోనేరు నాని, బుద్ధా వెంకన్నలకు ఉన్నా, IVR కాల్స్ ఫీడ్‌బ్యాక్, నేతల అభిప్రాయాల తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

Similar News

News October 19, 2025

ఆరోగ్యం కోసం ‘ధన్వంతరీ మంత్రం’

image

న‌మామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం స‌క‌ల‌ ఔషధీనాం
ఈ మంత్రం ధన్వంతరి స్వామివారిని కీర్తిస్తుంది. ఆయన జయంతి రోజున ఈ మంత్రాన్ని చదవడం వల్ల సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర దినాన మందులు దానం చేయడం, నిస్సహాయులకు ఔషధాలను అందించడం వల్ల దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెబుతారు.

News October 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్‌లాండ్ ప్లేయర్ అన్యాపత్‌తో అమీతుమీ

News October 19, 2025

ధన్వంతరీ ఎవరు?

image

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.