News October 18, 2025

తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

image

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.

Similar News

News October 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్‌లాండ్ ప్లేయర్ అన్యాపత్‌తో అమీతుమీ

News October 19, 2025

ధన్వంతరీ ఎవరు?

image

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

News October 19, 2025

వనపర్తి: మొబైల్ పోయిందా? ఇలా చేయండి!

image

సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి సూచన
✓ మొబైల్ చోరీకి గురైనా.. లేదా పోగొట్టుకున్నా వెంటనే కంప్లైంట్ చేయండి.
✓ https://www.ceir.gov.in వెబ్సైట్‌లో మీ ఫిర్యాదు నమోదు చేయండి.
✓ చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న ఫోన్ IMEI నంబర్ పోర్టల్‌లో ఇవ్వండి.
✓ మొబైల్ సమాచారం, మీ సమాచారం తెలియజేయండి.
✓ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
✓ తక్షణమే సిమ్ బ్లాక్ చేయించండి.