News October 18, 2025
తిరుపతి: పండుగ వేళ దోచేస్తున్నారు..!

దీపావళి నేపథ్యంలో తమిళనాడు, తెలంగాణ, కర్నాటక నుంచి తిరుపతికి ప్రైవేట్ బస్సుల ఛార్జీలకు అమాంతం రెక్కలొచ్చాయి. బెంగళూరు నుంచి వారాంతంలో సీటర్ రూ.600, స్లీపర్ రూ.1000 ఉండగా ఇప్పుడు ఆ ధరలు ఏకంగా రూ.1-2 వేల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఛార్జీలు భరించలేక కొందరు బైకులపై సొంతూర్లకు చేరుకుంటున్నారు.
Similar News
News October 18, 2025
అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు మృతి

మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తల్లి, కూతుర్లు అమెరికాలో మృతి చెందారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాత విగ్నేశ్ సతీమణి రమాదేవి(52), కుమార్తె తేజస్వి(32)ని అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం సమయంలో జరిగిన ప్రమాదంలో ఇరువురు మరణించినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 18, 2025
అఫ్గాన్ ఆడకున్నా సిరీస్ కొనసాగుతుంది: PCB

పాక్ వేదికగా జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి <<18038169>>తప్పుకుంటున్నట్లు<<>> అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్ ప్రకారమే (Nov 17-29) కొనసాగుతుందని PCB వెల్లడించింది. అఫ్గాన్ స్థానంలో ఇంకో జట్టును ఆడించేందుకు పలు బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు PCB వర్గాలు తెలిపాయి. పాక్, శ్రీలంకతోపాటు మూడో జట్టు పేరు ఖరారు కాగానే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పాయి.
News October 18, 2025
దీపావళి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ఆఫర్‌లు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కేవలం అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోళ్లు జరపాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను తెరవవద్దని ఎస్పీ కోరారు. ఫేక్ ప్రకటనలు నమ్మి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.