News October 18, 2025
పెద్దపల్లి: ఈనెల 22న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ రూమ్ నం. 225లో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రైవేటు ఇండస్ట్రీస్‌లో మిషన్ ఆపరేటర్, సూపర్వైజర్, క్లర్క్ వంటి 14 ఖాళీలు ఉన్నాయన్నారు. 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో హాజరుకావాలన్నారు.
Similar News
News October 19, 2025
HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.