News April 8, 2024

BREAKING: వైసీపీకి మరో షాక్

image

AP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామినీ బాల తల్లి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించిన వీరికి భంగపాటు ఎదురైంది. దీంతో పార్టీని వీడారు. నిన్న యామినీ బాల వైసీపీని వీడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 4, 2026

కిచెన్ గార్డెనింగ్ ఇలా ఈజీ

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టొమాటో, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. సరిపడా నీరే పోయాలి. కుండీలకు రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News February 4, 2026

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News February 4, 2026

ఏఐ షాక్ నుంచి తేరుకుని ఫ్లాట్‌గా ముగిశాయి!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్ల స్వల్ప లాభంతో 83,817కు చేరగా నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 25,776 వద్ద స్థిరపడింది. ఆంత్రోపిక్ సంస్థ తెచ్చిన కొత్త AI టూల్ వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ₹2లక్షలకోట్ల షేర్లను అమ్మేశారు. ఆ ఎఫెక్ట్ మార్కెట్లపై పడింది. TECHM -4.12%, HCL TECH -4.22%, TCS -6.95%, ఇన్ఫోసిస్ -7.19% నష్టాన్ని నమోదు చేశాయి.