News October 18, 2025

HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద BRS నేతల నిరసన

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జరిగిన బీసీ బంద్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Similar News

News October 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 19, 2025

CBN విషయంలో తప్పని రియలైజ్ అయ్యాను: జోగి రమేష్

image

AP: గతంలో అసెంబ్లీ చంద్రబాబు బాధపడిన విషయంలో తాము తప్పు చేశామని తన భార్య చెప్పిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అది తప్పని తర్వాత తానూ రియలైజ్ అయినట్లు తెలిపారు. తమ మధ్య రాజకీయ వైరమే ఉందని, ఇతర విషయాల్లో అందరిని గౌరవిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారబోనని, YSR బ్రాండ్‌తో జగన్ వెంట కొనసాగుతానని తెలిపారు. నకిలీ మద్యం <<18043835>>కేసులో<<>> చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆరోపించారు.

News October 19, 2025

యాడికి: 11 మందిపై కేసు నమోదు

image

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించింది. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, బాధితులు శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.