News October 18, 2025

TPT: మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం

image

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా పద్మావతి మహిళా యూనివర్సిటీ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ నవంబర్ 15.

Similar News

News October 19, 2025

కరీంనగర్‌లో 22న జాబ్ మేళా.!

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.

News October 19, 2025

గంగాధర, ధర్మపురికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కళాశాల విద్య కమిషనర్ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

News October 19, 2025

GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

image

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.