News October 18, 2025
విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

AP: VSP పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News October 19, 2025
ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?
News October 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 19, 2025
CBN విషయంలో తప్పని రియలైజ్ అయ్యాను: జోగి రమేష్

AP: గతంలో అసెంబ్లీ చంద్రబాబు బాధపడిన విషయంలో తాము తప్పు చేశామని తన భార్య చెప్పిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అది తప్పని తర్వాత తానూ రియలైజ్ అయినట్లు తెలిపారు. తమ మధ్య రాజకీయ వైరమే ఉందని, ఇతర విషయాల్లో అందరిని గౌరవిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారబోనని, YSR బ్రాండ్‌తో జగన్ వెంట కొనసాగుతానని తెలిపారు. నకిలీ మద్యం <<18043835>>కేసులో<<>> చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆరోపించారు.