News April 8, 2024
శాంతిచర్చల్లో ఎలాంటి పురోగతీ లేదు: హమాస్

ఇజ్రాయెల్‌తో శాంతిచర్చల్లో ఎలాంటి పురోగతీ లేదని హమాస్ సంస్థ ప్రకటించింది. ఈజిప్టులో ఇజ్రాయెల్‌తో కొత్తగా మరో దఫా చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదని స్పష్టం చేసింది. యుద్ధం చివరి దశకు చేరిందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులందరినీ విడిచిపెడితే తప్ప యుద్ధాన్ని ఆపేదిలేదని ఆయన తేల్చిచెబుతుండటం గమనార్హం.
Similar News
News February 4, 2026
అదే రోజున ఓటీటీలోకి MSVPG ఏడు భాషల్లో రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం త్వరలో OTTలో సందడి చేయనుంది. ఇప్పటికే OTT సంస్థ జీ5 దీనిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చినా డేట్ కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
News February 4, 2026
అసభ్యకరంగా కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు.
News February 4, 2026
ఐఐటీ గోవాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


