News October 18, 2025
కామారెడ్డి: వరి కోత యంత్రాల యజమానులకు శిక్షణ

కామారెడ్డిలో వరి కోత యంత్రాల యజమానులకు శనివారం శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిర్వహించారు. వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని సూచించారు. యంత్రాలను 18 RPM వద్ద మాత్రమే నడపాలని, దీంతో గింజల నాణ్యత దెబ్బతినకుండా, తక్కువ తాలు గింజలు వస్తాయన్నారు. కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News October 19, 2025
NZB: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

NZB, KMR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి నిజామాబాద్ జిల్లా(102)లో 2,568, కామారెడ్డి జిల్లా(49)లో 1,400పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.
News October 19, 2025
MHBD: లిక్కర్ షాపులకు 1,672 దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులకు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 61 లిక్కర్ షాపులకు గాను 1,672 దరఖాస్తులు వచ్చాయని మహబూబాబాద్ ఎక్సైజ్ SP కిరణ్ తెలిపారు. శనివారం 735 దరఖాస్తులు అందినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News October 19, 2025
రాశులను ఎలా నిర్ణయిస్తారు?

వ్యక్తి పుట్టిన సమయం, ప్రదేశం ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఆ జన్మించిన సమయానికి ఆకాశంలో చంద్రుడు ఉన్న రాశినే వారి జన్మ రాశిగా పరిగణిస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. పుట్టిన సమయానికి తూర్పున ఉదయించే రాశిని జన్మ లగ్నంగా వ్యవహరిస్తారు. జన్మ రాశి, నక్షత్రాల ఆధారంగానే జాతక ఫలితాలు నిర్ణయమవుతాయి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను జ్యోతిషం <<-se_10008>>కేటగిరీకి<<>> వెళ్లి చూడొచ్చు.