News April 8, 2024

NLG: KCRను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు: BRS MLA

image

వందరోజుల కాంగ్రెస్ పాలనలో 2014కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరవు తాండవిస్తుందని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు స్పందన లేదన్నారు. కేసీఆర్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నారు.

Similar News

News July 10, 2025

NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

image

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.

News July 10, 2025

NLG: మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.

News July 10, 2025

NLG: పక్షం రోజుల్లో కమిటీల పూర్తి.. పనిచేసే వారికే ఛాన్స్

image

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కంటే ముందే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. గ్రామాలు, మండలాల కమిటీలను నియమిస్తారు. గ్రామ, మండల స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసే వారినే అధ్యక్షులుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియ వచ్చే 10 -15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.