News October 18, 2025
బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.
Similar News
News October 19, 2025
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.
News October 19, 2025
అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం
News October 19, 2025
ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?