News October 18, 2025

GNT: 108లో మహిళకు సుఖ ప్రసవం.. ఆడబిడ్డ జననం

image

108 అంబులెన్స్‌లో శనివారం ఓ మహిళకు డెలివరీ అయింది. గుంటూరు జిల్లా 108 అంబులెన్స్ మేనేజర్ బాలకృష్ణ అందించిన సమాచారం మేరకు.. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంకు చెందిన రాణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, గరువుపాలెం వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది శంకర్, పైలెట్ కిషోర్ బాబు, యెహోషువాలు కలిసి ఆమెకు సుఖప్రసవం చేయగా.. ఆడబిడ్డ జన్మించింది.

Similar News

News October 19, 2025

శ్రీకాకుళం: ఇంటికొస్తూ యువకుడి మృతి

image

దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32), బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. దీపావళి కోసం బైకుపై ఇద్దరూ స్వగ్రామానికి శనివారం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. భర్త చనిపోగా భార్య తీవ్రంగా గాయపడింది.

News October 19, 2025

MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

image

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 19, 2025

‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

image

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.