News October 18, 2025
గర్భిణీలు, పిల్లలు బాణసంచాకు దూరంగా ఉండాలి

కొత్తగూడెం టౌన్ రామవరం 4 అంగన్వాడీ కేంద్రంలో శనివారం దీపావళి సంబరాలు జరిపారు. సూపర్వైజర్ పార్వతి హాజరై పిల్లలు, గర్భిణీలతో మాట్లాడారు. గర్భిణీలు, పిల్లలు బాణాసంచాకు దూరంగా ఉండాలని సూచించారు. దీపాలు వెలిగించి, మిఠాయిలు తిని సంతోషంగా దీపావళి జరుపుకోవాలని చెప్పారు. బాణసంచా నుంచి వచ్చే శబ్దం పొగ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
పెద్దేముల్: రూ.2 వేల కోసం హత్య

పెద్దేముల్ మండలంలో 2023లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాండూర్ DSP తెలిపిన వివరాలిలా.. బాలాజీకి ఇచ్చిన రూ.2,050ను తిరిగి ఇవ్వాలని మన్సాన్‌పల్లికి చెందిన రవి(39) గ్రామస్థుల ముందు గట్టింగా అడిగాడు. దీంతో బాలాజీ అవమానంగా భావించాడు. మద్యం తాగించి కత్తితో పొడవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
News October 19, 2025
ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply
News October 19, 2025
కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.