News October 18, 2025

JNTU: Pharm.D ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో ఆగష్టులో నిర్వహించిన Pharm.D 1, 2 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Similar News

News October 19, 2025

21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

image

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్‌లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.

News October 19, 2025

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా గుంజ శ్రీనివాసు

image

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేశ్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సిఫార్సుల మేరకు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.

News October 19, 2025

పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.