News October 18, 2025
పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
Similar News
News October 19, 2025
పాలకొల్లు: అక్వా రైతులను ఆదుకోవాలని మంత్రికి వినతి

పాలకొల్లు పర్యటనకు విచ్చేసిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు శనివారం జైభారత్ క్షీరారామ అక్వా రైతు సంఘం అధ్యక్షుడు జి. గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో అక్వా రైతులు వినతిపత్రం సమర్పించారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్య కౌంట్ రేటు పెరగకపోవడంతో తాము నష్టపోతున్నామని మంత్రికి వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు.
News October 18, 2025
వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News October 17, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.