News October 18, 2025

పెద్దపల్లి: కాలుష్యం నియంత్రణకు మార్గదర్శకాలు పాటించాలి: కలెక్టర్

image

దీపావళి సందర్భంగా పటాకుల వినియోగం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు ప్రభుత్వం, టీజీపీ‌సీబీ మార్గదర్శకాలను పాటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం తెలిపారు. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే పటాకులు కాల్చాలని, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో వాడకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News October 19, 2025

కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

image

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.

News October 19, 2025

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వాట్సప్ ద్వారా వచ్చే ఏపీకే అప్లికేషన్లు ఎట్టి పరిస్థితిలో డౌన్లోడ్ చేయరాదని సూచించారు.

News October 19, 2025

ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

image

ఆముదాలవలస MLA కూన రవికుమార్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.