News October 18, 2025

కురుపాం: అందుబాటులో లేని 108.. వ్యక్తి మృతి

image

కురుపాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18044722>>గాయపడ్డ<<>> గొట్టాపు గౌరినాయుడు మృతి చెందాడు. పూతికవలసకు చెందిన మృతుడు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో 30 నిమిషాల వరకు వాహనం రాలేదు. దీంతో ఆటోలో కురుపాం సీహెచ్సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News October 19, 2025

నరసరావుపేటలో పెరిగిన చికెన్‌ ధర.. కేజీ ఎంతంటే.?

image

నరసరావుపేటలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే లైవ్ కోడి ధర కేజీకి రూ. 10 పెరిగి రూ. 121కి చేరింది. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ. 220 నుంచి రూ. 240 వరకు, స్కిన్‌లెస్ రూ. 240 నుంచి రూ. 260 పలుకుతోంది. మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 900కు అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్ల ధర రూ. 560గా ఉంది. దీపావళి పండుగ నేపథ్యంలో చికెన్ అమ్మకాలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

News October 19, 2025

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.137 నుంచి రూ.144, మాంసం రూ.199 నుంచి 215 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.226 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 19, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: అనకాపల్లి ఎస్‌ఐ

image

అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పిసినికాడ జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.