News October 18, 2025

KNR: శాతవాహనలో MBA స్పాట్ అడ్మిషన్స్

image

MBA కోర్సులో 2025-2026 విద్యా సం.కి ప్రవేశాల కోసం అర్హత పొందిన, అర్హత లేని అభ్యర్థులకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్ మెంట్, శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. బి.హరి కాంత్ తెలిపారు. 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో ఉన్నట్లు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు, అవసరమైన ఫీజుతో హాజరుకావాలన్నారు.

Similar News

News October 19, 2025

MHBD: పెళ్లికి నిరాకరణ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. SI కరుణాకర్ తెలిపిన వివరాలు.. ఇనుగుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు(27) వరంగల్‌కు చెందిన ఓ అమ్మాయి 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు ఈ నెల 15న పురుగుమందు తాగాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

News October 19, 2025

జనగామ: అద్దె భవనాల్లో సంక్షేమ గురుకులాలు!

image

విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటైన సంక్షేమ శాఖల గురుకులాలు అద్దె భవనాల్లో అవస్థలు పడుతున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాల్సిన గురుకులాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అద్దెలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నుంచి ఒత్తిడికి గురవుతున్నాయి. జనగామ జిల్లాలోని 20 గురుకులాల్లో 9 బీసీ, 3 మైనారిటీ, 2 ఎస్టీ గురుకులాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

News October 19, 2025

చొప్పదండి: నవోదయ సీట్ల దరఖాస్తు గడువు పొడిగింపు.!

image

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి పరిమిత సీట్ల గడువు తేదీని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కే.బ్రహ్మానందరెడ్డి శనివారం తెలిపారు. 9వ, 11వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతులు చదువుతున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.