News October 18, 2025
వరంగల్: తగ్గేదేలే.. మద్యం టెండర్ల జోరు..!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తగ్గేదేలే అంటున్నారు. చివరి రోజు సాయంత్రం తర్వాత భారీగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. సాయంత్రం 5 వరకు సగానికి పైగా షాపుల్లో సింగిల్ డిజిట్ దాటలేదు. కానీ, 9 గంటల వరకు వరంగల్ అర్బన్‌లో 2945, వరంగల్ రూరల్ 1767, భూపాలపల్లిలో 1055, మహబూబాబాద్‌లో 1000కి పైగా వచ్చాయి. రాత్రి వేళలో సైతం బారులు తీరారు.
Similar News
News October 19, 2025
జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
News October 19, 2025
జిల్లా వ్యాప్తంగా 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 40.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అత్యధికంగా నంబులపూలకుంటలో 18.4మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా తనకల్లులో 2.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. గాండ్లపెంటలో 10 మిల్లీమీటర్లు, కదిరిలో 5.2మి.మీ, రొళ్లలో 4.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
News October 19, 2025
జనగామ: కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించాలి: డీఏఓ

పత్తి పంటను సాగు చేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో సాగు చేసిన పంట విస్తీర్ణం వివరాలను నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు పత్తి విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు. కావున రైతులు ఈ యాప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.