News October 19, 2025
Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 19, 2025
గృహిణి ఎన్ని వత్తుల దీపం పెట్టాలంటే?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు కూడా ప్రాధాన్యం ఉంది. గృహిణి స్వయంగా దీపం వెలిగించేటప్పుడు కుందిలో 5 వత్తులు ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఇవి కుటుంబంలోని 5 ముఖ్య అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అంటున్నారు. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమానికి, రెండోది అత్తమామల శ్రేయస్సుకు, మూడోది తోబుట్టువుల క్షేమానికి ఉద్దేశించినవి. నాల్గోది గౌరవం, ధర్మ వృద్ధిని, ఐదోది వంశాభివృద్ధిని సూచిస్తుంది’ అని చెబుతున్నారు.
News October 19, 2025
దీపావళి: రేపు పొద్దున్నే స్నానం చేస్తే..?

దీపావళి రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలని సూచిస్తున్నారు. ‘నేడు నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి గంగా స్నాన ఫలం లభిస్తుంది. స్నానానంతరం తెలుపు వస్త్రాలు ధరించి, మినప ఆకు, మినపప్పుతో చేసిన వంటకాలు తినాలి’ అని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలు పాటించడం శుభప్రదం.
News October 19, 2025
బ్రౌన్ షుగర్‌తో ఫేస్ మాస్క్

బ్రౌన్ షుగర్ అందాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాస్త బ్రౌన్ షుగర్‌లో పాలు, పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే బ్రౌన్ షుగర్‌లో బాదం నూనె, జాస్మిన్ ఆయిల్ కలిపి చర్మానికి రాసి, కాసేపటి తర్వాత కడిగేస్తే ముఖం తేమగా ఉంటుంది.