News October 19, 2025
అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం
Similar News
News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 19, 2025
రాష్ట్రంలో ACB మెరుపు దాడులు

TG: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్‌పోస్టులపై ACB మెరుపు దాడులు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా, ఆసిఫాబాద్(D)లోని వాంకిడి, సంగారెడ్డి(D)లోని జహీరాబాద్, కామారెడ్డి(D)లోని కామారెడ్డి, మద్నూరు, భద్రాద్రి(D)లోని అశ్వారావుపేట చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టి పలువురిని ప్రశ్నించింది. రవాణాశాఖ చెక్‌పోస్టులపై ACB ఏకకాలంలో దాడులు చేపట్టడం ఇది రెండోసారి.