News October 19, 2025
ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి: GWMC మేయర్

వరంగల్ నగరంలో బాణాసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బాణాసంచా దుకాణదారులు పాటించాల్సిన విధి విధానాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన సూచనలు చేశారు. పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజల భద్రతే తమ మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.
News October 19, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వాట్సప్ ద్వారా వచ్చే ఏపీకే అప్లికేషన్లు ఎట్టి పరిస్థితిలో డౌన్లోడ్ చేయరాదని సూచించారు.