News October 19, 2025
కామారెడ్డి: స్టార్ క్యాంపెనియర్‌గా షబ్బీర్ అలీ

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెనీయర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
Similar News
News October 19, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద శనివారం ఒక్కరోజులోనే 597 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో 325, సుల్తానాబాద్ 249, రామగుండం 373, మంథని 242 మొత్తంగా 1189 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.
News October 19, 2025
ALERT: టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్‌పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్‌కు దారి తీస్తాయంటున్నారు.
News October 19, 2025
జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.