News October 19, 2025
ఎలాంటి గొర్రెలు కొంటే ఎక్కువ ప్రయోజనం?

ఆడ గొర్రెలు ఏడాదిన్నర వయసు, 8-10 కిలోల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10- 15 కిలోల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తనపు పొట్టేలు, బలంగా, ఎత్తుగా ఉండి.. ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యంతో ఉండాలి. మందలో ప్రతీ 30 ఆడ గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు ఉండాలి.
Similar News
News October 21, 2025
సలాం పోలీస్

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న పంజాబ్ DSP కరమ్ సింగ్ నేతృత్వంలోని CRPF బృందం గస్తీ కాస్తోంది. అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగింది. వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
News October 21, 2025
‘శుక్లాంబరధరం విష్ణుం’ అర్థమిదే..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే!!
తెల్లని వస్త్రాలను ధరించినట్టి, విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టి, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టి, నాలుగు చేతులు కలిగినట్టి, శాంతిగల ముఖమును కలిగినట్టి గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలెను.
News October 21, 2025
ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ నెల 24(శుక్రవారం)న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు దీనికి మద్దతివ్వాలని కోరింది.