News October 19, 2025
హార్బర్ సముద్ర బీచ్‌లో పటిష్ఠ బందోబస్తు: ఎస్ఐ

నిజాంపట్నం హార్బర్ సముద్ర తీరంలో యాత్రికుల భద్రతకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ కందుల తిరుపతిరావు తెలిపారు. శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా బీచ్ పరిసరాలను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని అన్ని బీచ్‌ల వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బీచ్‌లో మద్యం తాగడం, నిషేధిత ప్రాంతాల్లో తిరగడం పూర్తిగా నిషేధమన్నారు. నింబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 19, 2025
మామిడిలో ఇనుపధాతు లోపం – నివారణ

మామిడిలో ఇనుపధాతులోప సమస్య ఉన్న చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోతుంది. సమస్య తీవ్రత పెరిగితే మొక్కల ఆకులు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా అన్నబేధి+1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చెట్టుపై పిచికారీ చేయాలి.
News October 19, 2025
జనగామ జిల్లా ఏర్పడి పదేళ్లు.. పరిశ్రమల ఊసేది!

జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన యువత ఎందరో ఉన్నారు. జిల్లా ఏర్పడితే స్థానికంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. జిల్లా ఏర్పడి పదేళ్లు దాటినా, స్థానికంగా పేరొందిన పరిశ్రమలు ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. యువతకు ఉపాధి కల్పించింది లేదు. దీంతో ఎప్పటిలాగే ఇక్కడి యువత పట్నాలలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
News October 19, 2025
జనగామ: కష్టజీవులకు.. లేబర్ కార్డు భద్రత!

ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసుకునే కష్టజీవులకు కార్మికశాఖ ద్వారా అందించే లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికులకు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లకు ఒక్కొక్కరికీ రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అలాగే, కార్మికుల కాన్పులకు సైతం రూ.30 వేల చొప్పున కార్మికశాఖ చెల్లిస్తుంది. అర్హులైన కార్మికులు కార్డు పొంది ఈ ప్రయోజనాలు అందుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.