News October 19, 2025
చిత్తూరు తాలూకా SI సస్పెండ్

చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు SP తుషార్ డూడీ ఆదేశాలు జారీ చేశారు. మల్లికార్జునపై పలు ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఓ బాధితుడు SI ఆడియో రికార్డును కలెక్టర్, ఎస్పీకి పంపినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపిన ఎస్పీ చర్యలు తీసుకున్నారు.
Similar News
News October 21, 2025
డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

సైన్స్‌లో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఈమె మూర్చ, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ఖైరా ప్రొఫెసర్‌షిప్ పొందారు. అక్కడ పలు విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్, 1961లో కెమిస్ట్రీలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు.
News October 21, 2025
అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత

అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ(29) కన్నుమూశారు. ‘టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారు’ అని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు.
News October 21, 2025
NZB: ముగిసిన రియాజ్ అంత్యక్రియలు

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం ముగిశాయి. బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో ముస్లిం సంప్రదాయ ప్రకారం ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు.