News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
Similar News
News February 5, 2026
రెవెన్యూ లక్ష్యాల సాధనకు ప్రత్యేక చర్యలు అవసరం: VZM కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల సాధనకు శాఖల వారీగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, లోటు ఉన్న శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు, రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 5, 2026
బంగ్లాదేశీయులు మా సోదరులు: పాక్ కెప్టెన్

భద్రతా కారణాలతో T20 WC నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, దానికి మద్దతుగా ఇండియాతో మ్యాచ్‌ను పాక్ <<19024958>>బాయ్‌కాట్<<>> చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించారు. ‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాక్‌కు వారిచ్చిన సపోర్టుకు కృతజ్ఞులం. టోర్నీలో వాళ్లు ఆడకపోవడం దురదృష్టకరం’ అని చెప్పినట్లు RevSportz తెలిపింది. INDతో లీగ్ మ్యాచ్ <<19053696>>ఆడబోమన్న<<>> పాక్ PMకు బంగ్లా క్రీడా సలహాదారు నజ్రుల్ థాంక్స్ చెప్పారు.
News February 5, 2026
మున్సి‘పోల్స్’లో సోషల్ మీడియా వార్

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.


