News October 19, 2025
నరసరావుపేటలో పెరిగిన చికెన్ ధర.. కేజీ ఎంతంటే.?

నరసరావుపేటలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే లైవ్ కోడి ధర కేజీకి రూ. 10 పెరిగి రూ. 121కి చేరింది. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ. 220 నుంచి రూ. 240 వరకు, స్కిన్‌లెస్ రూ. 240 నుంచి రూ. 260 పలుకుతోంది. మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 900కు అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్ల ధర రూ. 560గా ఉంది. దీపావళి పండుగ నేపథ్యంలో చికెన్ అమ్మకాలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News October 19, 2025
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సంత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06109 MS-SRC రైలును నేడు ఆదివారం, నం.06110 SRC-MS రైలును రేపు సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు సూళ్లూరుపేట, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 19, 2025
16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.
News October 19, 2025
KNR: కర్తవ్య భవన్‌లోకి మారిన బండి సంజయ్ ఆఫీస్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన శాఖ కార్యాలయంను కర్తవ్య భవన్‌లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ-డెవలెప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన కామన్ సెంట్రల్ సచివాలయాన్ని ప్రధాని AUG 6న ప్రారంభించారు. కాగా, దీపావళిని పురస్కరించుకొని నేడు మంచి మహూర్తం ఉండటంతో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ కర్తవ్య భవన్‌లోకి మంత్రి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు చేసి తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.