News October 19, 2025
జీఎస్టీ 2.0తో మంచి సంస్కరణలు: కేంద్రమంత్రి

జీఎస్టీ 2.0 తో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌరవిమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం NTR మున్సిపల్ గ్రౌండ్స్‌లో సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో GST2.0ను పీఎం మోదీ అమలు చేశారన్నారు.
Similar News
News October 21, 2025
కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 21, 2025
ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News October 21, 2025
శ్రీకాకుళం: ‘RTCలో 302 మందికి ప్రమోషన్లు’

శ్రీకాకుళం APRTC డివిజన్ పరిధిలో 23 కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 302 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం ప్రమోషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని ఆయన వివరించారు.