News October 19, 2025
NIEPMDలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ (NIEPMD) 7 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, సైకోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.590. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://niepmd.nic.in/
Similar News
News October 21, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను మెంతులు, అటుకులు వేయాలి.
* కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండుకొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచాలి.
News October 21, 2025
దానధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందా?

దానం చేసేటప్పుడు ‘నాకు పుణ్యం దక్కాలి’ అని ఆశించకూడదు. ‘నేను దానం చేశాను’ అనే అహంకారం ఉండకూడదు. లేకపోతే ఆ దానం చేసినందుకు పుణ్యం లభించదని పండితులు చెబుతున్నారు. ‘దానం చేయడం ద్వారా మనసు శుభ్రపడుతుంది. చిత్త శుద్ధి పెరుగుతుంది. ఈ శుభ్రమైన మనసుతోనే మనం జ్ఞానాన్ని పొందగలం. ఈ జ్ఞానమే మనకు జనన మరణాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఫలితంగా మోక్షం లభిస్తుంది. దానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వదు’ అంటున్నారు.
News October 21, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.