News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలు ఏ రోజున జరపాలి?

image

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియలు సూర్యాస్తమయానికి ఆ రోజునే ఉండటంతో.. అదే రోజు దీపావళిని జరుపుకోవడం శ్రేయస్కరం అని అంటున్నారు. ‘లక్ష్మీదేవి పూజ కోసం శుభ ముహూర్తం అక్టోబర్ 20న రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. భక్తులు ఈ ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేసి, దీపాలు వెలిగించి, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.

Similar News

News October 19, 2025

డ్యూడ్‌ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్

image

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తొలిరోజు రూ.22 కోట్లు కొల్లగొట్టిన ‘డ్యూడ్’ రెండో రోజు అంతకుమించి రూ.23 కోట్లు రాబట్టింది. చిన్న హీరో మూవీకి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం విశేషం.

News October 19, 2025

దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

image

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.

News October 19, 2025

మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్‌ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్‌లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.