News October 19, 2025
MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 19, 2025
డ్యూడ్ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తొలిరోజు రూ.22 కోట్లు కొల్లగొట్టిన ‘డ్యూడ్’ రెండో రోజు అంతకుమించి రూ.23 కోట్లు రాబట్టింది. చిన్న హీరో మూవీకి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం విశేషం.
News October 19, 2025
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.
News October 19, 2025
మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్‌ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్‌లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.