News October 19, 2025
విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా?

విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్దాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్థుల భవనాన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇందులో పురావస్తు విభాగానికి చెందిన 5 గ్యాలరీలు కలవు.
Similar News
News October 19, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద శనివారం ఒక్కరోజులోనే 597 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో 325, సుల్తానాబాద్ 249, రామగుండం 373, మంథని 242 మొత్తంగా 1189 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.
News October 19, 2025
ALERT: టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్‌పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్‌కు దారి తీస్తాయంటున్నారు.
News October 19, 2025
జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.