News October 19, 2025
వరంగల్: నేడు భోగి.. 22 వరకు దీపావళి సందడి

ఇంటిల్లిపాదినీ అలరించే దివ్వెల పండగ రానే వచ్చింది. నేడు భోగి పండగతో ప్రారంభమయ్యే వేడుకలు ఈ నెల 21న నోములతో ముగుస్తాయి. 20న దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. భోగి స్నానాలతో ప్రారంభమై కేదారీశ్వర వ్రతాలు నోములు ఎత్తుకునే వరకు వేడుకలు జోరుగా సాగుతాయి. దీపావళిని పురస్కరించుకొని పూల దుకాణాలు, నోము సామానులు, టపాసుల షాపులు సిద్ధమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి నెలకొంది.
Similar News
News October 21, 2025
రాజోలి: పిడుగుపాటుకు రైతు మృతి

రాజోలి మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో ఉదయం పొలం పనులకు వెళ్లిన కురువ మద్దిలేటి (41) మంగళవారం కురిసిన ఉరుములుతో కూడిన వర్షానికి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పొలం పనులకని వెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైలంలో రేపటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని EO తెలిపారు. కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రోజూ విడతల వారీగా మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేస్తామని వెల్లడించారు. హోమాలు, కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. అటు పుణ్యక్షేత్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
News October 21, 2025
డేంజర్: మేకప్ బ్రష్‌ను క్లీన్ చేయకపోతే..

మేకప్ వేసుకున్న తర్వాత కొందరు మహిళలు బ్రష్‌ను క్లీన్ చేయకుండా వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి కొత్త సమస్యలొస్తాయని తెలిపింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
#ShareIt