News October 19, 2025

బ్రౌన్ షుగర్‌తో ఫేస్ మాస్క్

image

బ్రౌన్ షుగర్ అందాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాస్త బ్రౌన్ షుగర్‌లో పాలు, పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయి. అలాగే బ్రౌన్ షుగర్‌లో బాదం నూనె, జాస్మిన్ ఆయిల్ కలిపి చర్మానికి రాసి, కాసేపటి తర్వాత కడిగేస్తే ముఖం తేమగా ఉంటుంది.

Similar News

News October 21, 2025

రేపు దానధర్మాలు చేస్తే..

image

‘బలి పాడ్యమి’గా చెప్పుకొనే కార్తీక శుద్ధ పాడ్యమిన బలి చక్రవర్తిని స్మరిస్తూ దానధర్మాలు చేస్తే అక్షయ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పురాణాల వాక్కు. ఈ సందర్భంగా రేపు అన్నదానం, వస్త్రదానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గోవర్ధన, గోవుల పూజ అపమృత్యు భయాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు. ఈ శుభ దినం మనలో దాతృత్వ గుణాన్ని పెంపొందిస్తుంది.

News October 21, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

➢ రేపు ఉ.11.07 గంటలకు ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ టీజ్, ఎల్లుండి ఉ.11.07 గంటలకు టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్
➢ వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా?: సినీ వర్గాలు
➢ ‘డ్యూడ్’ మూవీకి 4 రోజుల్లో ₹83Cr+ గ్రాస్ కలెక్షన్స్
➢ ‘K Ramp’కి 3 రోజుల్లో ₹17.5Cr+ గ్రాస్ వసూళ్లు
➢ ‘తెలుసు కదా’ మూవీకి 4 రోజుల్లో ₹16.3Cr+ గ్రాస్ కలెక్షన్స్

News October 21, 2025

9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

image

AP: స్వయం సహాయక సంఘాల జీవనోపాధిని మరింత మెరుగుపర్చేలా 9 వాట్సాప్ సేవలను CM చంద్రబాబు లైవ్ డెమోతో ప్రారంభించారు. సచివాలయంలో ఆయన మెప్మా ‘వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రిన్యూర్స్ ఎంటర్‌ప్రైజెస్’ను సమీక్షించారు. ఈ సందర్భంగా “ప్రజ్ఞా – మెప్మా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీని ఆరంభించారు. PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకంలో భాగంగా ₹1.25 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అందించారు.