News October 19, 2025
ప్రత్తిపాడు: ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

ప్రత్తిపాడు (M) ధర్మవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకు లారీని వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగ నేపథ్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తున్న వసంత్ కుమార్ సంధ్య దంపతులు ఆగి ఉన్న ఒక వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వసంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పండగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News October 21, 2025
‘కుష్టు నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలి’

కుష్టు వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కుష్టు వ్యాధి నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కుష్టు నిర్మూలనకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వైద్య పరిక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News October 21, 2025
రేపు దానధర్మాలు చేస్తే..

‘బలి పాడ్యమి’గా చెప్పుకొనే కార్తీక శుద్ధ పాడ్యమిన బలి చక్రవర్తిని స్మరిస్తూ దానధర్మాలు చేస్తే అక్షయ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పురాణాల వాక్కు. ఈ సందర్భంగా రేపు అన్నదానం, వస్త్రదానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గోవర్ధన, గోవుల పూజ అపమృత్యు భయాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు. ఈ శుభ దినం మనలో దాతృత్వ గుణాన్ని పెంపొందిస్తుంది.
News October 21, 2025
ములుగు: TOMCOM ఆధ్వర్యంలో విద్య, శిక్షణ, ఉపాధి

తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు విద్య, శిక్షణా, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవి తెలిపారు. జర్మనీ దేశంలో 3 సంవత్సరాల నర్సింగ్ కోర్సులో ప్రవేశంతో పాటు, నెలకు రూ.లక్ష స్టైఫెండ్ అందించబడుతుందని అన్నారు. వివరాలకు www.tomcom.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు.