News October 19, 2025
GNT: అత్యాచారం చేసి.. భయం లేకుండా బిర్యానీ తిన్నాడు.!

సత్రాంగచ్చి-చర్లపల్లి రైలులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు రాజారావును మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్ విక్రయించి బిర్యానీ తిన్నానని, గతంలో కేరళ మహిళపై కూడా ఇలానే అత్యాచారం చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. బాధితురాలి సిమ్‌ను తన ఫోన్‌లో వేయడంతో సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News October 21, 2025
HYD: ‘డిసెంబర్ 6లోపు వక్ఫ్ ఆస్తులు అప్‌డేట్ చేయాలి’

సెంట్రల్ వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తేదీలోపు వక్ఫ్ ఆస్తుల డేటాను ఉమీద్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీలకు, ముతవల్లీలను కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వక్ఫ్ కమిటీ కార్యాలయం తగిన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. HYD నాంపల్లిలోని వక్ఫ్ కార్యాలయంలో ముతవల్లీలు, మేనేజ్‌మెంట్ కమిటీలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.
News October 21, 2025
పెద్దపల్లి: ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

పెద్దపల్లిలోని రిక్రియేషన్ క్లబ్‌లో 69వ SGF కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల బాలబాలికలకు చదరంగ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. SGF జిల్లా కార్యదర్శి K.లక్ష్మణ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు కరీంనగర్, పెదదపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు వచ్చే నెల రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.