News October 19, 2025
VJA: రూ.1 లక్ష జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

విజయవాడలోని సీడాప్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన స్టేట్ ప్రాజెక్టు మేనేజర్-ఎంటర్‌ప్రైజ్ డెవలప్మెంట్ (4) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. MBA పూర్తి చేసి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారు https://seedap.ap.gov.in/లో ఈ పోస్టులకు అక్టోబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు. ఎంపికైన వారికి రూ.75 వేల నుంచి రూ. 1 లక్ష వేతనం ప్రతినెలా చెల్లిస్తామన్నారు.
Similar News
News October 21, 2025
ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి: మోదీ

దీపావళి వేళ దేశ ప్రజలకు PM మోదీ లేఖ రాశారు. ‘అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇది రెండో దీపావళి. ఈసారి చాలా ప్రత్యేకం. శ్రీరాముడు మనకు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, నీతి నేర్పాడు. కొన్ని నెలల క్రితం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇందుకు నిదర్శనం. నక్సలిజాన్ని నిర్మూలించిన ప్రాంతాల్లోనూ దీపాలు వెలిగాయి. ఇటీవల ఎంతోమంది హింసను వదిలి రాజ్యాంగంపై విశ్వాసంతో అభివృద్ధిలో భాగమవుతున్నారు’ అని పేర్కొన్నారు.
News October 21, 2025
ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

NLG: నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ చౌరస్తా వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
నాగర్ కర్నూల్‌లో పోలీసు అమరవీరుల ర్యాలీ

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘పోలీస్ అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువబోదని వారు పేర్కొన్నారు.